Thu Apr 10 2025 07:10:34 GMT+0000 (Coordinated Universal Time)
యువతకు గుడ్ న్యూస్ చెప్పిన రేవంత్
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా అతి త్వరలో ఉద్యోగాలను భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా అతి త్వరలో ఉద్యోగాలను భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఎల్.బి. స్టేడియంలో స్టాఫ్ నర్సులకు సంబంధించిన నియామక పత్రాలను అందచేసిన తర్వాత ఆయన మాట్లాడుతూ అతి త్వరలోనే పదిహేను వేల పోలీసు ఉద్యోగాలను భర్తీచేయనున్నామని చెప్పారు. విద్యార్థుల త్యాగాల వల్లనే తెలంగాణ వచ్చిందని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.
పదేళ్ల నుంచి...
గత పదేళ్ల నుంచి తెలంగాణ యువత ఆకాంక్ష నెరవేరలేదన్న ఆయన రానున్న రోజుల్లో ఉద్యోగాలను భర్తీ చేసి యువతలో నెలకొన్న నైరాశ్యాన్ని పారదోలతామని ఆయన ప్రకటించారు. గత ప్రభుత్వం నిరుద్యోగులపై ఎన్ని కేసులు పెట్టిందో తనకు తెలుసునని అన్నారు. ఇచ్చని హామీలన్నింటినీ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందని ఆయన భరోసా ఇచ్చారు. టీఎస్పీఎస్సీలో పకడ్బందీగా పరీక్షలను నిర్వహించేందుకు బోర్డును ప్రక్షాళన చేశామని తెలిపారు.
Next Story