Thu Jan 16 2025 16:00:34 GMT+0000 (Coordinated Universal Time)
రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన రేవంత్.. ఢిల్లీ నుంచే ఆదేశాలు
తెలంగాణ రైతులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు.
తెలంగాణ రైతులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. ఈ నెలాఖరులోగా రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. సన్నబియ్యంపై ఐదు వందల రూపాయల బోనస్ ఇవ్వాలని కూడా తెలిపారు. ఢిల్లీలో ఉన్న రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, మంత్రులతో మాట్లాడారు. రైతులను ఇబ్బంది పెట్టకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
అవసరమైన అన్ని చర్యలు...
మిల్లర్లు ఇబ్బంది పెట్టకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. గత ప్రభుత్వహయాంలో ధాన్యం సేకరణ విషయంలో రైతులు ఇబ్బందిపడ్డారన్న ఆయన ఈసారి అలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆరున్నర లక్షల ధాన్యాన్ని సేకరించారని, ఇంకా 30 లక్షల ధాన్యాన్ని సేకరించాల్సి ఉందని అధికారులు సీఎం దృష్టికి తెలిపారు. త్వరితగతంగా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. మిల్లర్లపై అవసరమైతే కేసులు కూడా పెట్టాలని కలెక్టర్లను ఆదేశించారు.
Next Story