Sun Mar 30 2025 07:30:42 GMT+0000 (Coordinated Universal Time)
Revanth Reddy : సాగర్ ఎమ్మెల్యేపై రేవంత్ అసహనం
కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశంలో నాగార్జున సాగర్ ఎమ్మెల్యే వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు

కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశంలో నాగార్జున సాగర్ ఎమ్మెల్యే వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. సీఎల్పీ సమావేశం జరుగుతున్న సమయంలో జయవీర్ బయటకు వెళ్లడంతో రేవంత్ రెడ్డి స్పందిస్తూ ఓ వైపు తాను ఇంత సీరియస్‌గా చెబుతుంటే జయవీర్ అలా వెళ్తున్నారని అని అసహనం వ్యక్తం చేశారు.
నాన్ సీరియస్ గా...
ఇంత నాన్ సీరియస్‌గా ఉంటారా అని ప్రశ్నించిన రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పట్ల సాఫ్ట్ కార్నర్‌తో ఉంటే.. మీపై వాళ్లు అభ్యర్థిని పెట్టరనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ గురించి మీకు చాలా తక్కువ తెలునంటూనే, రాజకీయాలు అంటే పిల్లలాట అనుకుంటున్నారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీరియస్‌గా వచ్చే ఎన్నికల్లోనూ ఎలా గెలవాలి అనే ప్లాన్‌తో పని చేయండని రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు సూచించారు.
Next Story