Mon Dec 23 2024 23:52:56 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన రేవంత్ సర్కార్
తెలంగాణ ప్రజలకు రేవంత్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 1,377 కోట్ల రూపాయల నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది
తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 1,377 కోట్ల రూపాయల నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో గ్రామీణ రహదారుల నిర్మాణానికి ఈ నిధులను వినియోగించాలని నిర్ణయించింది. మొత్తం 1323 కిలోమీటర్ల రహదారులు ఈ నిధుల కారణంగా బాగుపడనున్నాయి. గ్రామీణ ప్రాంతంలో రహదారులు అస్తవ్యస్థంగా మారడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు.
1,377 కోట్ల నిధులను...
కనీసం రహదారి సక్రమంగా లేకపోవడంతో రవాణా కూడా కష్టమవుతుంది. కొన్ని ప్రాంతాలకు ఆర్టీసీ బస్సులు రావడం కూడా గగనమై పోయింది. ట్రిప్పులు తగ్గించారు. ఈ నిధులను 92 నియోజకవర్గాల్లో వినియోగించనున్నారు. 641 పనులకు వెచ్చించనున్నారు. గ్రామీణ రహదారులు అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలంటూ మంత్రి సీతక్క చేసిన విజ్ఞప్తిని సానుకూలంగా స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇక గ్రామీణ రహదారులు ఈ నిధులతో బాగుపడనున్నాయి.
Next Story