Sun Dec 22 2024 19:14:09 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : తెలంగాణకు భారీగా పెట్టుబడులు.. ఫ్యూచర్ స్టేట్ గా పిలుద్దాం .. రేవంత్ పిలుపు
తెలంగాణను ఫ్యూచర్ స్టేట్ అని పిలుద్దామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపు నిచ్చారు.
తెలంగాణను ఫ్యూచర్ స్టేట్ అని పిలుద్దామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపు నిచ్చారు. అమెరికాలో పర్యటిస్తున్న రేవంత్ రెడ్డి వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కాలిఫోర్నియాలో జరిగిన ఇంటలిజెన్స్ బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఇండియన్ కాన్సులేట్ జనరల్ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది.
మంచి అవకాశాలు...
తెలంగాణలో పెట్టుబడులకు మంచి అవకాశాలున్నాయని తెలిపారు. అనేక ప్రాజెక్టులు తెలంగాణకు వచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నాయని తెలిపారు. ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల రాకతో హైదరాబాద్ లో ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయని రేవంత్ రెడ్డి తెలిపారు. అందుకే తెలంగాణను ప్యూచర్ స్టేట్ అని పిలుద్దామని రేవంత్ రెడ్డి అన్నారు
Next Story