Sun Dec 14 2025 05:54:42 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : యాదగిరి గుట్ట దేవస్థానానికి పాలకమండలి.. ముఖ్యమంత్రి సూచనలివే
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహదేవస్థానానికి కూడా తిరుమల తరహా బోర్డును ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహదేవస్థానానికి కూడా తిరుమల తరహా బోర్డును ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. బోర్డు ఏర్పాటుకు సంబంధించి త్వరలోనే నిర్ణయం వెలువడే అవకాశముంది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు ఏర్పాటుకు పాలకమండలిని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
అధికారులకు ఆదేశం...
బోర్డులో ఉండే నియమనిబంధనలపై ముఖ్యమంత్రి అధికారులతో చర్చించారు. రాజకీయాలకు తావు లేకుండా బోర్డును ఏర్పాటు చేయాలని, ఆలయంలో ఆధ్యాత్మికతను మరింత పెంచేందుకు, వివిధ కార్యక్రమాలను రూపొందించేందుకు ఆలయ పవిత్రతకు భంగం కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. దీంతో టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట దేవస్థానానికి కూడా త్వరలో ప్రభుత్వం పాలక మండలిని నియమించనుంది.
Next Story

