Mon Dec 23 2024 07:49:00 GMT+0000 (Coordinated Universal Time)
రేషన్ కార్డు నిబంధనపై క్లారిటీ ఇచ్చిన రేవంత్
తెలంగాణలో రైతు రుణమాఫీలో రేషన్ కార్డు నిబంధనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు
తెలంగాణలో రైతు రుణమాఫీలో రేషన్ కార్డు నిబంధనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయంపై స్పష్టత ఇచ్చారు. భూమి పాస్ బుక్ ఆధారంగానే రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. రేషన్ కార్డు రైతు కుటుంబాన్ని గుర్తించడానికేనని ఆయన తెలిపారు.
పాస్ బుక్ ఉన్నవారిని...
తెల్ల రంగు రేషన్ కార్డు ఉన్న వారికి మాత్రమే రెండు లక్షల రుణమాఫీ వర్తిస్తుందని, దీనివల్ల అనేక మంది రైతులు ఇబ్బంది పడతారని ప్రతిపక్షాలు ధ్వజమెత్తడంతో దీనిపై కలెక్టర్ల సమావేశంలో ఒక క్లారిటీ ఇచ్చారు. రైతు కుటుంబాన్ని గుర్తించడానికే రేషన్ కార్డు నిబంధన పెట్టామని, పాస్ బుక్ ఆధారంగానే రుణ మాఫీ జరుగుతుందని చెప్పారు.
Next Story