Mon Dec 23 2024 07:11:50 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : రైతు బంధు పంపిణీకి రేవంత్ గ్రీన్ సిగ్నల్
రైతు బంధు పంపిణీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు ఆయన ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ చేశారు.
రైతు బంధు పంపిణీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు ఆయన ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ చేశారు. రైతులకు రైతు బంధు పథకం కింద చెల్లింపులు చేయాలని ఆర్థిక శాఖ అధికారులకు తెలిపారు. విధివిధానాలు ఖరారు కానందున గతంలో మాదిరిగానే రైతులకు చెల్లింపులు చేయాలని అధికారులను ఆదేశాలు జారీ చేశారు.
ఎన్నికలకు ముందే...
ఎన్నికల ముందే రైతు బంధు పధకం కింద నిధులు విడుదల కావాల్సి ఉంది. అయితే నోటిఫికేషన్ విడుదల కావడం, అప్పట్లో హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలు కారణంగా రైతు బంధు పథకం కింద నిధులు నిలిచిపోయాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు బంధు పథకాన్ని కొనసాగిస్తామని, ఎక్కువగా నిధులు ఇస్తామని చెప్పింది. అయితే విధివిధానాలు ఖరారు కాకపోవడంతో పాత పద్ధతిలోనే నిధులు విడుదల కానున్నాయి.
Next Story