Thu Jan 16 2025 20:10:30 GMT+0000 (Coordinated Universal Time)
Revanth Reddy : వచ్చే నెలలో ప్రజా పాలన విజయోత్సవాలు
ప్రభుత్వం ఏర్పాటయి ఏడాది కావస్తుండటంతో ప్రజా పాలన విజయోత్సవాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయి ఏడాది కావస్తుండటంతో రాష్ట్రమంతటా ప్రజా పాలన విజయోత్సవాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. డిసెంబరు 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకూ రాష్ట్ర మంతటా విజయోత్సవాలు జరపాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఘనంగా చేయాలని అధికారులను ఆదేశించారు.
ఏడాది కావస్తుండటంతో...
ప్రతి శాఖ ఈ ఉత్సవాల్లో భాగస్వామ్యం కావాలని కోరారు. ప్రభుత్వం ఏర్పాటయిన తొలి ఏడాది సాధించిన ఘన విజయాలను ప్రజలకు వివరించాలని తెలిపారు. దీంతో పాటు రానున్న కాలంలో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఏం చేపట్టనున్నామో కూడా వివరించాలని సూచించారు. ఇందులో అధికారులు, మంత్రులు కూడా భాగస్వామ్యులు కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు.
Next Story