Mon Dec 23 2024 09:28:28 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : పోచారంంతో భేటీ అయిన రేవంత్ రెడ్డి
మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు.
మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి వెళ్లిన రేవంత్ రెడ్డి ఆయనను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. రేవంత్ రెడ్డి వెంట మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఉన్నారు. పోచారం శ్రీనివాసరెడ్డిని పార్టీలోకి తీసుకు వచ్చే ప్రయత్నం గత కొద్ది రోజులుగా సాగుతుంది. గత ఎన్నికల్లో బాన్సువాడ ఎమ్మెల్యేగా పోచారం శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ నుంచి గెలిచారు.
కొంత కాలంగా...
అదే సమయంలో బీఆర్ఎస్ నాయకత్వంపైన కూడా ఆయన అసంతృప్తిగా ఉన్నారన్న వార్తలు వచ్చాయి. పోచారం శ్రీనివాసరెడ్డి పార్టీ మారతారని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది. అయితే ఈ ప్రచారాన్ని దానిని ఆయన ఖండించలేదు. ఈరోజు రేవంత్ రెడ్డి ఆయన ఇంటికి చేరుకుని చర్చలు జరపడంతో పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ లో చేరిక ఖాయమయినట్లేనని తెలుస్తోంది.
Next Story