Mon Dec 23 2024 14:16:18 GMT+0000 (Coordinated Universal Time)
లాస్య నందిత అంత్యక్రియలు అధికారికంగానే
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ లాస్య నందిత అంత్యక్రియలను అధికారికంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ లాస్య నందిత అంత్యక్రియలను అధికారికంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ సెక్రటరీ శాంతకుమారిని ఆదేశించారు. లాస్య నందిత అంత్యక్రియలకు సంబంధించి అధికారిక ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. లాస్య భౌతిక కాయాన్ని అశోక్నగర్ లోని దోమలగూడలోని ఆమె నివాసం వద్ద ఉంచారు.
కేసీఆర్ నివాళులు...
ీబీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లాస్య నందిత భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. బీఆర్ఎస్ నేతలు కూడా కేసీఆర్ వెంట వచ్చారు. లాస్య నందిత అంత్యక్రియలను మారేడుపల్లిలోని తండ్రి సాయన్న సమాధి పక్కనే నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు.
Next Story