Sun Mar 23 2025 07:15:17 GMT+0000 (Coordinated Universal Time)
Revanth Reddy : 922 మందికి అపాయింట్ మెంట్ లెటర్స్.. అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలే
తమ ప్రభుత్వం నిరుద్యోగులకు అండగా నిలుస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.

తమ ప్రభుత్వం నిరుద్యోగులకు అండగా నిలుస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పంచాయతీరాజ్, రూరల్ డెవలెప్ మెంట్ లో ఉద్యోగాల నియామక పత్రాలను అందచేసే కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 922 మందికి నియామక పత్రాలను రవీంద్ర భారతిలో జరిగిన కార్యక్రమంలో అందచేశారు. గత ప్రభుత్వం కారుణ్య నియామకాలను చేపట్టకపోవడం, సరైన విధాన నిర్ణయం తీసుకోకపోవడం వల్ల పదేళ్ల కాలాన్ని కోల్పోయారని రేవంత్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిల్డ్ నౌ పోర్టల్ ను ప్రారంభించారు. నిరుద్యోగులకు ఇరవై నుంచి ఇరవై ఐదు లక్షల మంది కొలువుల కోసం తిరుగుతున్నారని అన్నారు.
కారుణ్య నియామకాలను...
ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకు వెళుతుందని తెలిపారు. కొలువుల కోసమే తెలంగాణ ఉద్యమం వచ్చిందని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఎంతో మంది ప్రత్యేక రాష్ట్రం కోసం త్యాగం చేశారన్నారు. రాష్ట్రం వచ్చినా నిరుద్యోగుల ఆకాంక్షలు నెరవేరలేదని రేవంత్ రెడ్డి అన్నారు. కారుణ్య నియామకాలు హక్కు అని ఆయన అభిప్రాయపడ్డారు. పోటీ పరీక్షలు కూడా గత ప్రభుత్వం నిర్వహించలేదన్నారు. శాశ్వత నిరుద్యోగులుగా లక్షలాది మంది మారారరన్నారు. పది నెలల్లో యాభై తొమ్మిది వేల ఉద్యోగాలు చేపట్టి దేశానికి మోడల్ గా తెలంగాణను నిలిపామని రేవంత్ రెడ్డి తెలిపారు. నియామకాలను ఎప్పటికప్పుడు చేపడతామని ఈసందర్భంగా రేవంత్ రెడ్డి మాట ఇచ్చారు.
Next Story