Sun Dec 22 2024 18:41:11 GMT+0000 (Coordinated Universal Time)
Revanth Reddy : తెలంగాణలో కులగణనకు ఆదేశం
త్వరలో తెలంగాణలో కులగణన కార్యక్రమం చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు
త్వరలో తెలంగాణలో కులగణన కార్యక్రమం చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఆయన ఈ మేరకు అధికారులను ఆదేశించారు. కులగణను చేపట్టేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. కులాల సంఖ్య తేలితే దాని దామాషా ప్రకారం బడ్జెట్ లో నిధులు కేటాయించాలని ప్రభుత్వం భావిస్తుంది.
ఫిబ్రవరి నెలలో...
కులాల సంఖ్య తేలితే నిధుల కేటాయింపులు కూడా సంఖ్యను బట్టి చేపట్టాలని ప్రభుత్వం భావిస్తుంది. అందుకోసమే కులగణన కోసం కసరత్తులు ప్రారంభించాలని రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఫిబ్రవరి నెలలో కులగణన ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని తెలిసింది. సచివాలయంలో జరిగిన సమీక్ష లో రేవంత్ రెడ్డి ఈ ఆదేశాలను అధికారులకు జారీ చేశారు.
Next Story