Tue Dec 24 2024 16:52:07 GMT+0000 (Coordinated Universal Time)
Revanth Reddy : నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన రేవంత్, 2 lakh jobs
ఏడాదిలోపే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు
ఏడాదిలోపే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. మీడియా ప్రశ్నలకు ఆయన సమాధానమిస్తూ వచ్చే ఏడాది డిసెంబరు 9 లోపు రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని తెలిపారు. ఇందుకోసం క్యాలండర్ కూడా త్వరలోనే విడుదల చేస్తామని చెప్పారు. టీఎస్పీఎస్సీ లో ఛైర్మన్ తో పాటు సభ్యులందరూ రాజీనామా చేశారని, గవర్నర్ నిర్ణయం రెండు మూడు రోజుల్లో వెలువడుతుందని రేవంత్ రెడ్డి తెలిపారు.
ఏడాదిలోగానే రెండు లక్షల ఉద్యోగాలు...
గవర్నర్ నిర్ణయం వెలువడిన వెంటనే టీఎస్పీఎస్సీ(TSPSC)కొత్త కార్యవర్గాన్ని ప్రకటిస్తామని, పోటీ పరీక్షలను ఖచ్చితంగా నిర్వహిస్తామని చెప్పారు. అత్యంత పారదర్శకంగా పరీక్షలు నిర్వహించి ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పారు. అభ్యర్థులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదని రేవంత్ రెడ్డి తెలిపారు. ఉద్యోగాల భర్తీ విషయంలో కాంగ్రెస్ ఇచ్చిన మాట తప్పదని, ఖచ్చితంగా అన్ని ప్రభుత్వ పోస్టులను భర్తీ చేయడానికి తమ ప్రభుత్వం రెడీగా ఉందని రేవంత్ రెడ్డి తెలిపారు.
Next Story