Thu Dec 26 2024 01:06:50 GMT+0000 (Coordinated Universal Time)
Revanth Reddy : కాళేశ్వరానికి పోదాం పా.. ఆ అద్భుతాన్ని ఏదో చూద్దాం కేసీఆర్ కు సవాల్
తెలంగాణకు వరంగల్ రెండో రాజధానిగా అన్ని అర్హతలున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
తెలంగాణకు వరంగల్ రెండో రాజధానిగా అన్ని అర్హతలున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. వరంగల్ లో జరిగిన జనజాతర సభలో ఆయన ప్రసంగించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పన్నెండు స్థానాలకు పదింటిలో గెలిపించి కాంగ్రెస్ పార్టీని ఆదరించారని, అలాగే ఈ ఎన్నికల్లోనూ మరోసారి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ప్రతి ఎకరాకు నీళ్లిచ్చే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు. ఈ ప్రాంతంలో ఇండ్రస్ట్రియల్ కారిడార్ ను తీసుకు వచ్చి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యత తమదేనని అన్నారు. తెలంగాణను దోచుకున్న కల్వకుంట్ల కుటుంబం పీడ విరగడయిందని రేవంత్ రెడ్డి అన్నారు.
ఇక్కడే కూర్చుని...
వానలొస్తే వరంగల్ చిన్న సముద్రంలా మారిపోతుందని, అందుకే వరంగల్ ను అందమైన నగరంగా తీర్చిదిద్దుతామని రేవంత్ రెడ్డి తెలిపారు. వరంగల్ పట్టణానికి అవుటర్ రింగ్ రోడ్డుతో పాటు ఎయిర్ పోర్టు కూడా నిర్మిస్తామని, ఆ బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు. గత పదేళ్లుగా కల్వకుంట్ల కుటుంబం దోచుకుతినిందన్నారు. వరంగల్ పట్టణాన్ని పీడిస్తున్న చెత్త సమస్యకు పరిష్కారం చూపుతామని కూడా ఆయన మాట ఇచ్చారు. ఇక్కడే కూర్చుని సమస్యలను పరిష్కరించే బాధ్యతను తీసుకుంటానని తెలిపారు. మామా అల్లుళ్లకు ఇంకా అధికార మత్తు దిగినట్లు లేదని అన్నారు. కేసీఆర్ అసెంబ్లీకి కూడా రాకుండా తప్పించుకు తిరుగుతున్నారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుతం ఏందో చూద్దాం పద అని కేసీఆర్ కు సవాల్ విసిరారు.
Next Story