Wed Dec 25 2024 13:07:42 GMT+0000 (Coordinated Universal Time)
Revanth Reddy : వరదల్లో మృతి చెందిన సైంటిస్ట్ కుటుంబానికి రేవంత్ పరామర్శ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైంటిస్ట్ అశ్విని కుటుంబాన్ని పరామర్శించారు. ఇంటికి వెళ్లి ఆమె కుటుంబ సభ్యులను ఓదార్చారు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైంటిస్ట్ అశ్విని కుటుంబాన్ని పరామర్శించారు. అశ్విని ఇంటికి వెళ్లి ఆమె కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తండ్రీ మోతీలాల్ నాయక్, కుమార్తె అశ్విని మరణించారు. అశ్విని ఛత్తీస్ఘడ్ లోని రాయ్పూర్ లో సైంటిస్ట్గా పనిచేస్తున్నారు. అయితే తన సోదరుడు ఎంగేజ్మెంట్ కోసం ఇటీవల ఆమె స్వగ్రామం వచ్చారు.
ఎంగేజ్మెంట్ కని వచ్చి...
సెలవులు పూర్తి కావడంతో విధుల్లో చేరాల్సినందున ఆమె తప్పనిసరి పరిస్థితుల్లో భారీ వర్షం కురుస్తున్నప్పటికీ కారులో ఎయిర్పోర్టుకు బయలుదేరారు.తండ్రితో కలసి వెళుతున్న ఆమె ప్రయాణిస్తున్న కారు వాగులో కొట్టుకుపోవడంతో ఇద్దరు చనిపోయారు. ఈరోజు ఖమ్మం జిల్లా సింగరేణి మండలం గంగారాం తండాలో నునావత్ మోతీలాల్ కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరామర్శించారు.
Next Story