Fri Dec 27 2024 18:49:03 GMT+0000 (Coordinated Universal Time)
Revanth Reddy : చెప్పులు కొనుక్కోవడానికి నా దగ్గరకు వచ్చింది గుర్తులేదా?
బీఆర్ఎస్ నేత హరీశ్ రావుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఆయనకు ఘాటు కౌంటర్ ఇచ్చారు
హరీశ్ రావుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఆయనకు ఘాటు కౌంటర్ ఇచ్చారు. తన ఇంటి ముందుకు వచ్చి చెప్పులు పట్టుకుని నిల్చుని అడ్డుక్కుంది నువ్వు కాదా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. చెప్పులు మోసే నేత తనకు సవాల్ విసురుతున్నాడని హరీశ్ రావును రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. చెప్పులు కొనుక్కోవాలంటే తన దగ్గరకు హరీశ్ రావు వచ్చిన రోజులు మర్చిపోతున్నాడని అన్నారు. ఈరోజు ఫామ్ హౌస్ లు కట్టుకుని కులుకుతున్నాడని ఫైర్ అయ్యారు.
బుల్డోజర్లు రెడీ...
నీ బలుపు, అహంకారాన్ని ఉస్మాన్ సాగర్ లో కలిపితే వాటిని ప్రజలు తాగాల్నా అని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబానికి దోపిడీ చరిత్ర అని అన్నారు. పేదలకు మంచి చేస్తే వారికి నచ్చడం లేదన్నారు. మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టు కేవలం ప్రజల కోసమేనని అన్నారు. హైడ్రా వేరని, మూసీ ప్రాజెక్టు వేరని ఆయన అన్నారు. బుల్డోజర్లను సిద్ధం చేశానని, ఎవరు అడ్డుకుంటారో చూస్తాను రండి అంటూ రేవంత్ రెడ్డి హరీశ్ రావుకు సవాల్ విసిరారు. రెండు ఫామ్ హౌస్ ల వద్ద కేటీఆర్, హరీశ్ రావులతో తాను చర్చకు సిద్ధమని రేవంత్ ఛాలెంజ్ చేశారు.
Next Story