Mon Dec 23 2024 11:41:27 GMT+0000 (Coordinated Universal Time)
కొత్త సెక్రటేరియట్ ప్రారంభానికి ఇద్దరు సీఎంలు
తెలంగాణ కొత్ సచివాలయం భవనం ప్రారంభానికి ముఖ్యమంత్రులు ఏకే స్టాలిన్, హేమంత్ సోరెన్ లు హాజరు కానున్నారు
కొత్త సచివాలయం భవనం ప్రారంభోత్సవానికి తమిళనాడు, జార్ఖండ్ ముఖ్యమంత్రులు ఏకే స్టాలిన్, హేమంత్ సోరెన్ లు హాజరు కానున్నారు. వచ్చే నెల 17 ఉదయం 11.30 గంటల నుంచి 12.30 గంటల మధ్యలో తెలంగాణ కొత్త సచివాలయం ప్రారంభానికి ముహూర్తంగా నిర్ణయించారు. ప్రారంభోత్సవానికి ముందు వాస్తుపూజ, చండీయాగం, సుదర్శనయాగాలను నిర్వహించనున్నారు. కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా కొత్త సచివాలయాన్ని ప్రారంభించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.
భారీ బహిరంగ సభ...
ఇద్దరు ముఖ్యమంత్రులతో పాటు బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వియాదవ్, బీఆర్ అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్ ఇతర రాష్ట్రాల నుంచి పలువురు ప్రముఖులు జాహరు కానున్నారు. సచివాలయం ప్రారంభించిన తర్వాత భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేయనున్నారు. పరేడ్ గ్రౌండ్స్ లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది.
Next Story