Fri Apr 04 2025 13:31:57 GMT+0000 (Coordinated Universal Time)
సన్ రైజర్స్ హైదరాబాద్ కు హెచ్.సీ.ఏ బెదిరింపులు.. సీఎం రెస్పాన్స్ ఇదే
సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యాన్ని పాస్ లకోసం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సభ్యులు కొందరు వేధిస్తున్నారని ముఖ్యమంత్రి దృష్టికి వచ్చింది

సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యాన్ని పాస్ లకోసం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సభ్యులు కొందరు వేధిస్తున్నారని ముఖ్యమంత్రి దృష్టికి వచ్చింది. దీంతో ఆయన సీరియస్ అయ్యారు. దీనిపై ఆరా తీసిన రేవంత్ రెడ్డి విజిలెన్స్ దర్యాప్తునకు ఆదేశించారు. పాస్ ల కోసం సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యాన్ని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సభ్యులు వేధించారన్న ఘటన సంచలనం రేపింది.
విచారణ జరిపి...
విచారణ జరిపి వెంటనే తమకు నివేదిక ఇవ్వాలని విజిలెన్స్ డీజీ కొత్త కోట శ్రీనివాసరెడ్డిని ఆదేశించారు. పాస్ ల కోసం వేధిస్తే తాము హైదరాబాద్ ను వదలివెళ్లిపోతామని సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం లేఖ ద్వారా హెచ్చరించడంతో ఇది సీఎంవో కార్యాలయం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లింది. దీనికి స్పందించిన రేవంత్ రెడ్డి వెంటనే విచారణ జరిపి ఆరోపణలు నిజమైతే చర్యలు తీసుకోవాలని కోరారు.
Next Story