Fri Nov 22 2024 19:17:41 GMT+0000 (Coordinated Universal Time)
భాగ్యలక్ష్మి ఆలయం వద్ద చికోటి ప్రవీణ్ హల్ చల్
ఇటీవల చికోటి ప్రవీణ్ పుట్టినరోజు సందర్భంగా.. పత్రికల్లో ఫుల్ పేజీ యాడ్స్ రావడం కూడా సంచలనమైంది. తాజాగా..
క్యాసినో కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న చికోటి ప్రవీణ్ పేరు.. ఇటీవల తరచూ మళ్లీ వార్తల్లో వినిపిస్తోంది. మొన్న గజ్వేల్ కు అనుమతి లేకుండా ర్యాలీగా రావడంతో.. అతనిపై కేసు నమోదైంది. ఇటీవల చికోటి ప్రవీణ్ పుట్టినరోజు సందర్భంగా.. పత్రికల్లో ఫుల్ పేజీ యాడ్స్ రావడం కూడా సంచలనమైంది. తాజాగా.. నేడు తెలంగాణలో లాల్ దర్వాజ బోనాలు సందర్భంగా చికోటి ప్రవీణ్ తన సిబ్బందితో కలిసి భాగ్యలక్ష్మి ఆలయానికి రావడం మరో సంచలనానికి దారితీసింది. ప్రైవేటు సెక్యూరిటీతో ఇలా జనాల్లోకి రావడమేంటి అంటూ.. పోలీసులు చికోటి ప్రవీణ్ ను, ఆయన సిబ్బందిని అడ్డుకున్నారు.
ప్రైవేటు సెక్యూరిటీతో జనాల్లోకి రావడం చట్టరీత్యా నేరమని పోలీసులు తెలిపారు. దాంతో చికోటి ప్రవీణ్ పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. తన సిబ్బందిని పోలీసులు బలవంతంగా తీసుకెళ్లారని చికోటి ప్రవీణ్ ఆరోపించాడు. అమ్మవారి దర్శనానికి వస్తే అడ్డుకుని, అవమానించారంటూ చికోటి ప్రవీణ్ ఓవరాక్షన్ చేశాడు. ఆలయంలోకి వెపన్స్ తో రావడం నేరమని తనకు కూడా తెలుసన్న ప్రవీణ్.. సెక్యూరిటీ వద్ద లైసెన్స్ డ్ గన్ లే ఉన్నాయన్నారు. సెక్యూరిటీని చెక్ చేసి పంపుతామన్న పోలీసులు ఇలా అడ్డుకున్నారని వాపోయారు. ఇక ఆయన ప్రైవేటు సెక్యూరిటీలో ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారి వద్ద వెపన్స్ ఉన్నట్లు గుర్తించారు. వాటికి లైసెన్స్ లేకపోతే.. కేసులు నమోదు చేస్తామని తెలిపారు.
Next Story