Sun Dec 22 2024 09:37:24 GMT+0000 (Coordinated Universal Time)
హ్యాపీ బర్త్డే టు కవిత అంటూ...?
నిజామాబాద్ కు చెందిన చిన్ను గౌడ్ విన్నూత్న తరహాలో కవితకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పుట్టినరోజు నేడు. ఈ సందర్బంగా విన్నూత్నంగా కొందరు తమ అభిమానాన్ని చాటు కుంటున్నారు. 1978 మార్చి 13వ తేదీన కవిత జన్మించారు. కవిత పుట్టిన రోజు సందర్బంగా బీఆర్ఎస్ నేతలు అనేక దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. కొందరు రక్తదానాలు, అన్నదానం వంటి సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అయితే నిజామాబాద్ కు చెందిన చిన్ను గౌడ్ విన్నూత్న తరహాలో కవితకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
సముద్రపు అంచున...
అండమాన్ నికోబార్ దీవుల్లో సముద్రపు అంచుల వరకూ వెళ్లిన చిన్ను గౌడ్ ఎమ్మెల్సీ కవితకు జన్మదిన శుభాకాంక్షలు విన్నూత్నంగా తెలిపారు. హ్యాపీ బర్త్ డే అంటూ బ్యానర్లతో సముద్రపు అంచున ప్రదర్శించి తన అభిమానాన్ని చాటుకున్నారు. నీటి అడుగున డైవింగ్ చేస్తూ బ్యానర్లను ప్రదర్శించడం ద్వారా విన్నూత్న రీతిలో కవితకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Next Story