Mon Dec 23 2024 09:01:28 GMT+0000 (Coordinated Universal Time)
Junior NTR : రేవంత్ పిలుపునకు జూనియర్ ఎన్టీఆర్ స్పందన
జూనియర్ ఎన్టీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటనకు స్పందించారు. డ్రగ్స్ రహిత సమాజం నిర్మాణం కోసం ఆయన యువతకు పిలుపు నిచ్చారు
జూనియర్ ఎన్టీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటనకు స్పందించారు. డ్రగ్స్ రహిత సమాజం నిర్మాణం కోసం ఆయన యువతకు పిలుపు నిచ్చారు. దేవర సినిమా విడుదల సందర్భంగా ఆయన ఒక వీడియోను విడుదల చేశఆరు. డ్రగ్స్ కు బానిసలై ఎందరో యువకులు తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారన్న జూనియర్ ఎన్టీఆర్ దేశ భవిష్యత్ మీ చేతుల్లోనే ఉందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.
డ్రగ్స్ రహిత సమాజం కోసం...
తాత్కాలిక ఆనందం కోసం డ్రగ్స్ కు అలవాటుపడవద్దని జూనియర్ ఎన్టీఆర్ కోరారు. తనతో చేతులు కలిపి డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం సంకల్పంలో భాగస్వాములు కావాలని జూనియర్ ఎన్టీఆర్ పిలుపు నిచ్చారు. తెలంగాణలో ఎవరు డ్రగ్స్ విక్రయిస్తున్నా, కొనుగోలు చేస్తున్నా వెంటనే నార్కోటిక్స్ విభాగానికి సమాచారం అందించాలని జూనియర్ ఎన్టీఆర్ తన అభిమానులను కోరారు.
Next Story