Sun Jan 12 2025 13:55:43 GMT+0000 (Coordinated Universal Time)
పాడి కౌశిక్ రెడ్డి vs సంజయ్... తోపులాటకు దిగిన ఎమ్మెల్యే
కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ సమావేశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశికర్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ మధ్య ఘర్షణ జరిగింది
కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ సమావేశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశికర్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ మధ్య ఘర్షణ జరిగింది. ఈ సమావేశంలో కౌశిక్ రెడ్డి సంజయ్ ను ఏపార్టీ అంటూ హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు. దీంతో ఇద్దరూ కాసేపు వాగ్వాదం జరిగింది. మైకులు లాక్కోవడానికి ప్రయత్నించారు. ఇద్దరి మధ్యతోపులాట జరిగింది. అమ్ముడుపోయి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లావంటూ మండి పడ్డారు.
ఏ పార్టీ ఎమ్మెల్యే అంటూ...
కేసీఆర్ బొమ్మతో గెలిచిన సంజయ్ ఏ పార్టీ అని అడగటం తప్పా? అని ప్రశ్నించారు. కేసీఆర్ పెట్టిన బిక్షతో ఎమ్మెల్యే అయి సమీక్ష సమావేశంలో ఏం అడుగుతాడని పాడి కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు. దమ్ముంటే రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలుపొందాలని సవాల్ విసిరారు. మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలోనే ఈ ఘర్ణణ జరిగింది. దీంతో పోలీసులు పాడి కౌశిక్ రెడ్డిని బయటకు తీసుకెళ్లారు.
Next Story