Sun Dec 22 2024 10:08:39 GMT+0000 (Coordinated Universal Time)
Telangana Elections : బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ.. లాఠీ ఛార్జి
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో బీఆర్ఎస్ , కాంగ్రేస్ పార్టీల మధ్య ఘర్షణ జరిగింది
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో బీఆర్ఎస్ , కాంగ్రేస్ పార్టీల మధ్య ఘర్షణ జరిగింది. నామినేషన్ల సందర్భంగా ఒకేసారి రెండు పార్టీల అభ్యర్థులు రావడంతో ఈ ఘర్షణ జరిగింది. రెండు పార్టీలకు చెందిన అభ్యర్థులు మల్రెడ్డి రంగారెడ్డి, మంచిరెడ్డి కిషన్ రెడ్డి భారీ ర్యాలీతో నామినేషన్ వేయడానికి వచ్చారు.
ఎదురుపడటంతో...
ఒకరికొకరు ఎదురుపడటంతో పరస్పరం రాళ్ల దాడులు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఇరు పార్టీల కార్యకర్తలకు గాయాలయ్యాయని తెలిసింది. ఈ సందర్భంగా కార్యకర్తలను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీ ఛార్జి చేశారు. ఇరు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా ఉందని పోలీసులు చెప్పారు. ప్రస్తుతం పరిస్థిితి అదుపులోకి వచ్చిందని చెప్పారు. కొందరు పోలీసులకు కూడా గాయాలయ్యాయి.
Next Story