Sun Dec 14 2025 06:16:13 GMT+0000 (Coordinated Universal Time)
మునుగోడును చూసి అధైర్యపడొద్దు
మునుగోడు ఉప ఎన్నికల ఫలితాలను చూసి కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరూ అధైర్యపడవద్దని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కోరారు

మునుగోడు ఉప ఎన్నికల ఫలితాలను చూసి కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరూ అధైర్యపడవద్దని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కోరారు. మునుగోడు ఉప ఎన్నికల్లాంటి ఎన్నికలను కాంగ్రెస్ ఎన్నో చూసిందని ఆయన అన్నారు. డబ్బు, మద్యం వెదజల్లి ఇటు కేంద్రం, అటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీలు ఓటర్లను ప్రలోభ పెట్టారని ఆయన మండి పడ్డారు.
రెండు ప్రభుత్వాలు...
ప్రజా సమస్యల పరిష్కారంలో రెండు ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆయన అన్నారు. ప్రజలు ఎవరూ ప్రభుత్వాల పట్ల సంతృప్తికరంగా లేరని మల్లు భట్టి విక్రమార్క అన్నారు. సాధారణ ఎన్నికల్లో బీజేపీి మరోసారి మట్టికరవడం ఖాయమని తెలిపారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు తెలంగాణలో మంచి స్పందన కనిపించిందన్నారు. ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల ఆదరణ మరింత పెరుగుతుందన్న నమ్మకంతో ఉన్నామన్నారు.
Next Story

