Sun Dec 14 2025 06:15:12 GMT+0000 (Coordinated Universal Time)
వరదలతో అల్లాడుతుంటే.. ఢిల్లీలో రాజకీయాలా?
ప్రజలు వరదలతో కష్టాల్లో ఉంటే సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లి రాజకీయాలు చేస్తున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు

రాష్ట్ర ప్రజలు వరదలతో కష్టాల్లో ఉంటే సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లి రాజకీయాలు చేస్తున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. వరద పరిస్థితులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. హైదరాబాద్ లోనూ అనేక ప్రాంతాలు నీట మునిగాయన్నారు. ప్రజల కష్టాలను టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. వరద సాయం అందించకుండా ఢిల్లీకి వెళ్లి తిరగడమేంటని ఆయన ప్రశ్నించారు. వెంటనే అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయాలని అన్నారు.
వర్సాకాల సమావేశాలను...
వర్సాకాల సమావేశాలను కేసీఆర్ ప్రభుత్వం ఇంతవరకూ ఏర్పాటు చేయలేదన్నారు. రాష్ట్రంలో చాలా సమస్యలున్నాయని, వాటిపై చర్చించేందుకు సమావేశాలను ఏర్పాటు చేయాలని మల్లు భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. ప్రజల సమస్యలను పక్కన పెట్టి రాజకీయాల కోసమే కేసీఆర్ సమయాన్ని వెచ్చిస్తున్నారన్నారు. మునుగోడు రాజకీయాలపై తాను కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో మాట్లాడని, అంతా సర్దుకుంటుందని మల్లు భట్టి విక్రమార్క అన్నారు.
Next Story

