Mon Dec 23 2024 17:23:36 GMT+0000 (Coordinated Universal Time)
నాలుగు రోజుల్లో భట్టి పాదయాత్ర
సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఈ నెల 16 నుంచి పాదయాత్ర ప్రారంభించనున్నారు.
సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఈ నెల 16 నుంచి పాదయాత్ర ప్రారంభించనున్నారు. ఆయన ఆదిలాబాద్ జిల్లా బోథ్ నుంచి యాత్ర ప్రారంభిస్తారు. హాత్ సే హాత్ జోడో యాత్రకు కొనసాగింపుగా ఈ యాత్ర చేపట్టనున్నారు. ఇప్పటికే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేత మహేశ్వర్ రెడ్డిలు తమ పాదయాత్రలను ప్రారంభించారు. మల్లు భట్టి విక్రమార్క పాదయాత్ర దాదాపు 1,365 కిలోమీటర్ల మేర సాగనుందని చెప్పారు.
91 రోజుల పాటు...
బోథ్ నియోజకవర్గంలోని హుత్నూరు మండలం పిప్పిరి గ్రామంలో ఈ నెల 16వ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు మల్లు భట్టి విక్రమార్క పాదయాత్ర ప్రారంభం కానుంది. ఆదిలాబాద్ జిల్లా నుంచి ఖమ్మం వరకూ కొనసాగే ఈ యాత్ర మొత్తం 39 నియోజకవర్గాల మీదుగా సాగనుంది. ఈ మేరకు రోడ్ మ్యాప్ సిద్ధం చేశారు. ఈ నెల 16వ తేదీ నుంచి జూన్ 15 వరకూ 91 రోజుల పాటు యాత్ర కొనసాగుతుందని కాంగ్రెస్ నేతలు వెల్లడించారు.
Next Story