Mon Dec 23 2024 14:28:26 GMT+0000 (Coordinated Universal Time)
సింగరేణి కార్మికులకు దసరా కానుక
సీఎం కేసీఆర్ ఆదేశాలతో .. అర్హులైన సింగరేణి కార్మికులకు దసరా కానుకగా రూ.368 కోట్లను సంస్థ చెల్లించనుంది. 2020-2021లో..
సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. దసరా కానుక ఉద్యోగులకు సంస్థ లాభాల్లో వాటా ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించారు. సింగరేణి కాలరీస్ సంస్థ 2021-22 సంవత్సరానికి గాను వచ్చిన లాభాల్లో 30 శాతం వాటాను సింగరేణి ఉద్యోగులకు దసరా కానుకగా అందించాలని సీఎం నిర్ణయించారు. దసరా లోపు ఈ ప్రత్యేక ప్రోత్సాహకాన్ని దసరాలోపు వెంటనే చెల్లించాలని సింగరేణి చైర్మన్ మరియు మేనేజింగ్ డైరక్టర్ కు సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగరావు ఉత్తర్వులు జారీ చేశారు.
సీఎం కేసీఆర్ ఆదేశాలతో .. అర్హులైన సింగరేణి కార్మికులకు దసరా కానుకగా రూ.368 కోట్లను సంస్థ చెల్లించనుంది. 2020-2021లో కార్మికులకు లాభాల్లో వరుసగా 28 శాతం..29 శాతం వాటాను దసరా కానుకగా చెల్లించారు. 2021-22 సంవత్సరానికి గాను సింగరేణి సాధించిన లాభాల్లో 30 శాతం వాటాను సంస్థ కార్మికులకు దసరా కానుకగా చెల్లించాలని సీఎం ఆదేశించడంతో.. త్వరలోనే అర్హులైన కార్మికులకు ఈ ప్రోత్సాహకం అందనుంది.
Next Story