Tue Nov 05 2024 16:19:37 GMT+0000 (Coordinated Universal Time)
ధర్మంగా పనిచేస్తే.. రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయ్ : సీఎం కేసీఆర్
కర్ణాటకలో ఇప్పుడు ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో అందరికీ తెలిసిందేనన్న సీఎం.. ప్రశాంత వాతావరణంటే సంపద..
కేంద్ర ప్రభుత్వం ధర్మంగా, నిబద్ధతగా పనిచేస్తే.. రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయని సీఎం కేసీఆర్ అన్నారు. బుధవారం మల్లన్నసాగర్ ను ప్రారంభించి, జాతికి అంకితమిచ్చారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో సీఎం ప్రసంగిస్తూ.. దేశం దారి తప్పుతోందని, దానిని గాడిలో పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం భారత్ లో దుర్మార్గమైన వ్యవస్థ నడుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కర్ణాటకలో ఇప్పుడు ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో అందరికీ తెలిసిందేనన్న సీఎం.. ప్రశాంత వాతావరణంటే సంపద, పరిశ్రమలు, భూ సంపదలు పెరుగుతాయన్నారు. హైదరాబాద్ లోనూ మత కల్లోలాలు వస్తే పరిశ్రమలు వస్తాయా ? అని ప్రశ్నించారు.
Also Read : మల్లన్నసాగర్ ను జాతికి అంకితమిచ్చిన సీఎం కేసీఆర్
మతం పేరుతో చెలరేగే క్యాన్సర్ ను అందరూ కలిసి తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసే దిశగా ముందుకెళుతున్నట్లు, చివరి రక్తపుబొట్టు వరకు దేశాన్ని సెటిల్ చేస్తానని తెలిపారు. హైదరాబాద్ అభివృద్ధి గురించి మాట్లాడుతూ.. కొత్త పరిశ్రమల రాకతో లక్షలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తున్నాయన్నారు. అలాగే అంతర్జాతీయ విమానాలు కూడా హైదరాబాద్ కు వస్తున్నాయన్నారు. ఐటీ రంగంలో హైదరాబాద్ అభివృద్ధి చెందుతోందని, భాగ్యనగరాన్ని మరింత అభివృద్ధి చేస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు.
Next Story