మాట ఇచ్చాం.. ఎన్ని కష్టాలొచ్చినా పూర్తి చేయాల్సిందే
రైతు రుణమాఫీ పూర్తి చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు.
రైతు రుణమాఫీ పూర్తి చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. గురువారం నుండి రైతు రుణమాఫీ తిరిగి ప్రారంభించాలన్నారు. కేంద్రం తీరు వల్లే రుణమాఫీ జాప్యమైందని అన్నారు. తెలంగాణకు ఇవ్వాల్సిన నిధుల విషయంలో కేంద్రం కక్షపూరితంగా వ్యవహరించడం వల్లే రుణమాఫీ ఆలస్యమైందని తెలిపారు. ఎఫ్ఆర్బీఎం నిధుల్లో కేంద్రం ఏకపక్షంగా కోత విధించిందని.. రైతులకు మరో రూ.19వేల కోట్ల రుణాలను అందించాల్సి ఉందని అన్నారు. ఈ నేపథ్యంలో రుణమాఫీని మళ్లీ ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ఆగస్టు 3 నుండి రైతు రుణమాఫీని ప్రారంభించి, సెప్టెంబర్ 2వ వారం లోపు పూర్తి చేయాలని ఆదేశించారు. ఇక తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కూడా ఆగస్టు 3 నుండి ప్రారంభం కానున్నాయి. డిసెంబర్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణకు ఇవే చివరి సమావేశాలు కావడంతో.. రుణమాఫీ మీద విమర్శలు రాకుండా చూసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఎన్నికలకు ముందు అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షాలు రుణమాఫీ అంశం ఎత్తకూడదని.. కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు.