Mon Dec 23 2024 06:31:58 GMT+0000 (Coordinated Universal Time)
భావోద్వేగానికి గురైన సీఎం కేసీఆర్
సీఎం కేసీఆర్ సాయిచంద్ భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. ఎక్కడ, ఎలాంటి సమావేశమైనా కేసీఆర్ వెంటే ఉండే ..
తెలంగాణ ఫోక్ సింగర్, తెలంగాణ వేర్హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ (39) గుండెపోటుతో కన్నుమూసిన విషయం తెలిసిందే. ప్రముఖులు, అభిమానులు నివాళులు అర్పించేందుకు సాయిచంద్ భౌతిక కాయాన్ని గుర్రంగూడలోని ఆయన నివాసం వద్ద ఉంచగా.. తెలంగాణ మంత్రులు, బీఆర్ఎస్ నేతలంతా సాయిచంద్ భౌతికకాయానికి నివాళులు అర్పించారు. మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ లు సాయిచంద్ మృతదేహాన్ని చూసి కంటతడి పెట్టుకున్నారు.
సీఎం కేసీఆర్ సాయిచంద్ భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. ఎక్కడ, ఎలాంటి సమావేశమైనా కేసీఆర్ వెంటే ఉండే సాయిచంద్ ఇక లేడన్న నిజాన్ని కేసీఆర్ జీర్ణించుకోలేకపోయారు. భౌతిక కాయాన్ని చూడగానే భావోద్వేగానికి గురయ్యారు. ఉబికి వస్తోన్న కన్నీటిని ఆపుకున్నారు. సాయిచంద్ తండ్రి, భార్యను పరామర్శించగా.. ఆమె బోరున విలపించింది. ఉదయం నుంచి ఆమె విలపిస్తున్న తీరు అందరిచేత కంటతడి పెట్టిస్తోంది. సాయి లే సాయి.. నిన్నిలా చూడలేను సాయి.. లే అంటూ భార్య రోధిస్తున్న తీరు వర్ణనాతీతం. సాయిచంద్ కు కుమారుడు, కుమార్తె ఉన్నారు. మధ్యాహ్నం సాయిచంద్ భౌతిక కాయానికి అంత్యక్రియలు జరగనున్నాయి.
Next Story