Sun Dec 22 2024 21:17:01 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు : సీఎం కేసీఆర్
ఆవిర్భావ దినోత్సవానికి ఎంతో ప్రాముఖ్యత ఉందన్న సీఎం కేసీఆర్.. ప్రత్యేక రాష్ట్ర పోరాటంలో అన్ని వర్గాలవారు పాల్గొన్నారన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ 10వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల హృదయాలు ఆనందం, గర్వంతో నింపుకున్న సందర్భమని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ ప్రజలు గర్వించే క్షణం జూన్ 2వ తేదీ అని గుర్తు చేసుకున్నారు. ఆవిర్భావ దినోత్సవానికి ఎంతో ప్రాముఖ్యత ఉందన్న సీఎం కేసీఆర్.. ప్రత్యేక రాష్ట్ర పోరాటంలో అన్ని వర్గాలవారు పాల్గొన్నారన్నారు. ఎంతోమంది ఈ రాష్ట్రం కోసం ప్రాణత్యాగాలు చేశారని, తెలంగాణ ఉద్యమ అమరవీరులందరికీ, వారి అంకిత భావానికి హృదయపూర్వకంగా నివాళి అర్పిస్తున్నట్లు తెలిపారు. ఉద్యమ సమయంలో ఎన్నో ముఖ్యమైన సంఘటనలు చోటు చేసుకున్నాయని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు.
ఆర్టీసీ ఉద్యోగులకు డీఏ పెంపు..
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా టీఎస్ఆర్టీసీ తన ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ఉద్యోగులకు 4.9 శాతం డీఏ మంజూరు చేసినట్లు టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్, ఎండీ సజ్జనార్ ఓ ప్రకటనలో వెల్లడించారు. జూన్ నెల వేతనంతో కలిపి ఉద్యోగులకు డీఏ చెల్లించనున్నట్లు ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది. 2011లో 29 రోజుల పాటు సకల జనుల సమ్మెలో ఆర్టీసీ ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల కానుకగా పెండింగ్ లో ఉన్న ఏడో డీఏను ఉద్యోగులకు మంజూరు చేయాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది.
Next Story