Fri Nov 22 2024 20:46:46 GMT+0000 (Coordinated Universal Time)
ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్న సీఎం కేసీఆర్
వైరల్ జ్వరం బారినపడిన తెలంగాణ సీఎం కేసీఆర్‌కు
వైరల్ జ్వరం బారినపడిన తెలంగాణ సీఎం కేసీఆర్‌కు చాతీలో ఇన్ఫెక్షన్ అయింది. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ముఖ్యమంత్రి అల్పాహార పథకం ప్రారంభోత్సవం సందర్భంగా ఓ టీవీ చానల్‌తో మంత్రి మాట్లాడుతూ ఈ విషయం తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వైరల్ ఇన్ఫెక్షన్ తర్వాత చాతీలో బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ మొదలైందని తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగా ఉన్నారని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. కోలుకుని త్వరలోనే ప్రజల ముందుకు వస్తారని తెలిపారు.
వైరల్ ఫీవర్ వల్ల సీఎం కేసీఆర్ గత 3 వారాలుగా ప్రభుత్వ కార్యక్రమాలకు, ప్రజలకు దూరంగా ఉంటున్నారు. వైద్యులు ఆయనకు ప్రగతి భవన్లో చికిత్స అందిస్తున్నారు. సీఎం కేసీఆర్ కొన్ని రోజులుగా వైరల్ ఫీవర్‌తో బాధ పడుతున్నారని, ప్రగతి భవన్లో ఐదుగురు వైద్యుల బృందం ఆయనకు చికిత్స అందిస్తోందని సెప్టెంబర్ 26న కేటీఆర్ ట్విట్టర్ ద్వారా బయటపెట్టారు. వారం రోజులుగా సీఎం కేసీఆర్ జ్వరం, దగ్గు సమస్యలతో బాధపడుతున్నారని అప్పట్లో తెలిపారు. ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నారని వేగంగా కోలుకుంటున్నారని చెప్పారు. త్వరలోనే ప్రజల ముందుకు వస్తారని అన్నారు.
Next Story