Fri Nov 22 2024 23:12:59 GMT+0000 (Coordinated Universal Time)
కొల్లూరులో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ప్రారంభం.. వసతులు ఇవే
తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, హరీష్ రావు, మల్లారెడ్డి, వేముల ప్రశాంత్, తలసాని..
సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం కొల్లూరులో 144 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఆసియాలోనే అతిపెద్దదైన కేసీఆర్ నగర్ 2 బీహెచ్ కే డిగ్నిటీ హౌసింగ్ కాలనీని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, హరీష్ రావు, మల్లారెడ్డి, వేముల ప్రశాంత్, తలసాని శ్రీనివాస్ యాదవ్ లతో పాటు జీహెచ్ఎంసీ మేయర్ పాల్గొన్నారు. 144 ఎకరాల విస్తీర్ణంలో..రూ.1489.29 కోట్ల వ్యయంతో.. 60 వేల మందికి ఆవాలం ఉండేలా 15,660 ఇళ్లను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. కార్పొరేట్ అపార్ట్ మెంట్లకు ఏమాత్రం తీసిపోకుండా ఇళ్ల నిర్మాణం చేపట్టింది.
600 స్క్వేర్ ఫీట్ విస్తీర్ణంలో ఒక్కో ఫ్లాట్ లో రెండు బెడ్రూమ్ లు, ఒక హాల్, కిచెన్, రెండు బాత్రూమ్ లను నిర్మించారు. 13.5 కిలోమీటర్ల పొడవైన రోడ్లు, 1250 కిలోలీటర్ల కెపాసిటీతో సంపులు, 750 కిలో లీటర్ల కెపాసిటీతో తాగునీటి రిజర్వాయర్, 9 ఎంఎల్ఓ కెపాసిటీతో సీవరేజ్ ట్రీట్ మెంట్ ప్లాంట్, విద్యుత్ సరఫరా కోసం 137 ట్రాన్స్ ఫార్మర్లు,117 బ్లాకుల్లో 234 లిఫ్టుల సౌకర్యం, 118 షాపులతో మొత్తం 3 షాపింగ్ కాంప్లెక్సులు, ఫంక్షన్లు, ఇతర అవసరాల కోసం కమ్యూనిటీ హాల్ ను నిర్మించారు. కేసీఆర్ నగర్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆరుగురు లబ్ధిదారులకు కేసీఆర్ చేతులమీదుగా ఇళ్ల పట్టాలను అందజేశారు.
Next Story