Fri Nov 22 2024 22:29:31 GMT+0000 (Coordinated Universal Time)
ఇక్కడా ఎకరా అమ్మితే ఏపీలో 5 కొనుక్కోవచ్చు : సీఎం కేసీఆర్
గురువారం పటాన్ చెరులో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో..
తెలంగాణలో భూముల విలువపై సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపీలో ఒక ఎకరా అమ్మితే తెలంగాణలో ఐదు కొనుక్కోవచ్చని అన్నారని, కానీ ఇప్పుడు పరిస్థితి తారుమారైందని కేసీఆర్ తెలిపారు. రాష్ట్రాన్ని పాలించే ప్రభుత్వం పాలన సరిగ్గా చేస్తే, అభివృద్ధి చేస్తే.. భూముల విలువలు పెరుగుతాయన్నారు. మంచి నాయకత్వం, మంచి ప్రభుత్వం ఉంటే భూముల విలువలు పెరుగుతాయని పేర్కొన్నారు. ఇప్పుడు తెలంగాణలో ఉన్న భూముల్ని అమ్మితే.. ఏపీలో నాలుగైదు కొనుక్కోవచ్చని సంచలన వ్యాఖ్యలు చేశారు. పటాన్ చెరులో ప్రస్తుతం ఎకరా భూమి విలువ రూ.30 కోట్లు ఉందన్నారు.
గురువారం పటాన్ చెరులో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. రూ.183 కోట్ల వ్యయంతో పటాన్ చెరులో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మిస్తున్నట్లు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ ను గెలిపిస్తే.. పటాన్ చెరుకు కూడా మెట్రో వస్తుందని హామీ ఇచ్చారు. మహిపాల్ రెడ్డి నాయకత్వంలో పటాన్ చెరు అభివృద్ధి చెందిందన్నారు. గతంలో పటాన్ చెరులో పరిశ్రమలు విద్యుత్ కోసం సమ్మె చేశారని, ఇప్పుడు అవే పరిశ్రమలు మూడు షిఫ్టులు పనిచేస్తున్నాయన్నారు. తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ నంబర్ వన్ స్థానంలో ఉందని సీఎం కేసీఆర్ తెలిపారు. మహిపాల్ రెడ్డిని మరోసారి గెలిపిస్తే పటాన్ చెరుకు మెట్రో, ఐటీ పరిశ్రమలు వస్తాయని చెప్పారు.
Next Story