Sat Nov 23 2024 07:19:07 GMT+0000 (Coordinated Universal Time)
డ్రగ్స్ వాడకం అనే మాటే వినిపించకూడదు : సీఎం కేసీఆర్
మాదక ద్రవ్యాల వినియోగంలో దోషులుగా తేలినవారు ఎంతటివారైనా సరే కఠినంగా వ్యవహరించాలని అన్నారు. కఠిన చర్యల
తెలంగాణలో డ్రగ్స్ వాడకం అనే మాటే వినిపించకుండా కఠినంగా వ్యవహరించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు జనవరి 28, శుక్రవారం ప్రగతి భవన్ లో స్టేట్ పోలీస్ అండ్ ఎక్సైజ్ కాన్ఫరెన్స్ జరపాలని సీఎం నిర్ణయించారు. రాష్ట్రంలో మాదకద్రవ్యాల వినియోగాన్ని నియంత్రించే దిశగా చేపట్టాల్సిన కఠిన చర్యల పై బుధవారం ప్రగతి భవన్ లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ , డిజిపి మహేందర్ రెడ్డి, హైద్రాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ లతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షించారు.
Also Read : ఖిలాడి నుంచి "ఫుల్ కిక్కు" మాస్ సాంగ్ విడుదల..
ఈ సమీక్షలో సీఎం మాట్లాడుతూ.. మాదక ద్రవ్యాల వినియోగంలో దోషులుగా తేలినవారు ఎంతటివారైనా సరే కఠినంగా వ్యవహరించాలని అన్నారు. కఠిన చర్యల అమలకై ప్రత్యేకంగా ప్రణాళికలు రూపొందించాలన్నారు. ఇందుకు గాను రాష్ట్ర వ్యాప్తంగా 1000 మందితో కూడిన నార్కాటిక్ అండ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ కంట్రోల్ సెల్ పోలీసు విభాగాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర డిజిపి మహేందర్ రెడ్డి ని సీఎం కేసీఆర్ ఆదేశించారు.
Also Read : సీసీఐ పునరుద్ధరణ కోసం కేంద్రంపై వత్తిడి
శుక్రవారం సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ సదస్సులో రాష్ట్ర హోంమంత్రి, ఎక్సైజ్ శాఖ మంత్రి, సీఎస్, డిజిపి, డీజీలు.. అన్ని జిల్లాల ఎస్పీలు, కమిషనర్లు, డీసీపీలతో పాటు ఎక్సైజ్ శాఖకు చెందిన ఎస్పీలు, ఉన్నతాధికారులంతా హాజరుకానున్నారు. రాష్ట్రంలో మాదక ద్రవ్యాల వాడకాన్ని కఠినంగా నియంత్రించేందుకు చేపట్టాల్సిన కార్యాచరణ విధి విధానాలను ఈ సదస్సులో చర్చించనున్నారు.
Next Story