Sun Dec 22 2024 16:23:40 GMT+0000 (Coordinated Universal Time)
సీఎం కేసీఆర్ వరంగల్ పర్యటనలో ఆమెకు తప్పిన ప్రమాదం
జనగామ జిల్లా పెంబర్తి కళాతోరణం వద్ద కేసీఆర్‌కు ఘన స్వాగతం పలికేందుకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
సీఎం కేసీఆర్ వరంగల్ పర్యటనలో పెను ప్రమాదం తప్పింది. ముఖ్యమంత్రికి స్వాగతం పలికేందుకు వెళ్తున్న మహిళా ఆఫీసర్ ప్రమాదానికి గురైంది. ఈ రోజు వరంగల్‌లో సీఎం కేసీఆర్ పర్యటిస్తున్న విషయం తెలిసిందే. జనగామ జిల్లా పెంబర్తి కళాతోరణం వద్ద కేసీఆర్‌కు ఘన స్వాగతం పలికేందుకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యేలు, సెక్యూరిటీ సిబ్బంది బయలుదేరారు. అయితే కాన్వాయ్ తిరిగి వెళ్లేటప్పుడు వాహనం నుంచి ఓ మహిళా సెక్యూరిటీ ఆఫీసర్ జారీ హైవే రోడ్డుపైన పడిపోయింది. అప్రమత్తమైన అధికారులు వాహనాలు నిలిపి వేశారు. ఈ ప్రమాదంలో మహిళా అధికారిణికి స్వల్ప గాయాలు అయినట్లు సమాచారం.
ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జనగామ జిల్లా పెంబర్తి కాకతీయ కళాతోరణం వద్ద మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్వాగతం పలికారు. మంత్రి దయాకర్ రావుతో పాటు ఎంపీ రవించంద్ర, ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య, రెడ్కో చైర్మన్ సతీష్ రెడ్డి, జనగామ జెడ్పీ చైర్మన్ సంపత్ రెడ్డి తదితరులు ఉన్నారు. అంతకుముందు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రతిమ హాస్పిటల్‌ను సందర్శించి, ఏర్పాట్లను పరిశీలించారు.
Next Story