Mon Dec 23 2024 16:03:25 GMT+0000 (Coordinated Universal Time)
ఈ నెల 18న మేడారం జాతరకు కేసీఆర్
ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 18వ తేదీన మేడారం జాతరకు వెళ్లనున్నారు. సమ్మక్క, సారలమ్మకు కేసీఆర్ మొక్కులు తీర్చుకోనున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 18వ తేదీన మేడారం జాతరకు వెళ్లనున్నారు. సమ్మక్క, సారలమ్మకు కేసీఆర్ మొక్కులు తీర్చుకోనున్నారు. ఈ నెల 16వ తేదీన మేడారం జాతర ప్రారంభమవుతున్న సంగతి తెలిసిందే. ఇందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు యంత్రాంగం మొత్తం మేడారంలోనే ఉంది. కోటి మందికి పైగా మేడారం జాతరను సందర్శించుకుంటారని అంచనా ఉంది.
అన్ని ఏర్పాట్లు.....
ఈ క్రమంలో వీఐపీల తాకిడి కూడా ఎక్కువగానే ఉంటుంది. ఈనెల 18వ తేదీన మేడారం జాతరకు ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తారని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. ఇందుకోసం 34 పార్కింగ్ ప్లేస్ లను ఏర్పాటు చేసిటన్లు తెలిపారు. ఏ సమస్య తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకున్నామని ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు.
Next Story