Mon Dec 23 2024 00:52:06 GMT+0000 (Coordinated Universal Time)
CM Revanth Reddy కొందరు చేసే పనులతో జర్నలిస్టులందరికీ చెడ్డపేరు: సీఎం రేవంత్ రెడ్డి
కొందరు చేసే పనులతో జర్నలిస్టులందరికీ చెడ్డపేరు వస్తోందని
కొందరు చేసే పనులతో జర్నలిస్టులందరికీ చెడ్డపేరు వస్తోందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రవీంద్రభారతిలో జవహర్లాల్ నెహ్రూ జర్నలిస్టు హౌసింగ్ సొసైటీ లో సభ్యులకు భూమి పత్రాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
జర్నలిస్టులు సమాజానికి చికిత్స చేసే డాక్టర్లని, మీ సమస్యకు మా ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపిస్తోందని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. వృత్తిపరమైన గౌరవాన్ని ఎవరూ పెంచరని, అది మనకు మనమే పెంచుకోవాలన్నారు. ప్రజాభిప్రాయం, జర్నలిస్టుల సూచనలతో ప్రజా ప్రభుత్వం ముందుకు వెళుతోందని, వ్యవస్థలపై నమ్మకం పెంచాలన్నదే మా ప్రభుత్వ విధానమని రేవంత్ రెడ్డి అన్నారు. జర్నలిజం కూడా వ్యవస్థల్లో ఒక భాగమే.. ఆనాడు రాజాకీయ పార్టీలు సిద్ధాంత భావజాల వ్యాప్తి కోసమే పత్రికలు ఏర్పాటు చేసుకునేవన్నారు. కానీ ఈరోజుల్లో ఉన్మాద ధోరణితో వ్యవహరించే పరిస్థితులు ఏర్పడ్డాయని తెలిపారు. కొందరు చేసే పనులతో జర్నలిస్టులందరికీ చెడ్డపేరు వస్తోందని, కొంతమంది జర్నలిస్టు పదం అర్ధాన్నే మార్చేస్తున్నారన్నారు. నిజమైన జర్నలిస్టులకు ఎలాంటి నష్టం జరగకుండా చూసుకునే బాధ్యత మా ప్రభుత్వానిదని హామీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి.
భాష విషయంలోనూ కొన్ని పత్రికలు గీత దాటుతున్నాయని.. ముఖ్యమంత్రి హోదానూ అవమానపరిచేలా వ్యవహరిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. కేవలం రాజకీయ పార్టీల యజమానులను రక్షించేందుకే కొన్ని మీడియా సంస్థలు ప్రాధాన్యతనిస్తున్నాయని అన్నారు. నిజమైన జర్నలిస్టులను కాపాడుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉంది. ఇళ్ల స్థలాల విషయంలో ఎవరూ ఆందోళన చెందొద్దని.. అర్హులైన వారిని ఫ్యూచర్ సిటీలో భాగస్వాములను చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.

Next Story