మాట నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట నిలబెట్టుకున్నారు. ఓ స్విగ్గీ డెలివరీ బాయ్ కుటుంబానికి
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట నిలబెట్టుకున్నారు. ఓ స్విగ్గీ డెలివరీ బాయ్ కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.2 లక్షలు అందించారు. డిసెంబర్ 23న గిగ్ వర్కర్స్‌తో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో సమావేశం జరిగింది. ఆ సమావేశంలో నాలుగు నెలల క్రితం ఫుడ్ డెలివరీ కోసం వెళ్లి ప్రమాదవశాత్తు మరణించిన స్విగ్గీ బాయ్ అంశాన్ని సీఎం ప్రస్తావించారు. గత ప్రభుత్వం ఆ కుటుంబానికి ఏదైనా సాయం చేస్తుందని తాను ఎదురు చూశానని.. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఆ కుటుంబ వివరాలు తెలుసుకుని ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.2 లక్షలు ఆ కుటుంబానికి అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఇచ్చిన మాట మేరకు.. కేవలం వారం రోజుల్లోనే అధికారులు ఆ స్విగ్గీ డెలివరీ బాయ్ కుటుంబ వివరాలు తెలుసుకున్నారు. బాధిత స్విగ్గీ బాయ్ కుటుంబాన్ని సచివాలయానికి పిలిపించి రూ.2 లక్షల ఆర్థిక సాయాన్ని అందించారు. ఇచ్చిన మాట ప్రకారం కేవలం వారం రోజుల్లోనే ఆ కుటుంబానికి సీఎం రేవంత్ రెడ్డి ఆర్థిక సాయాన్ని అందించారు.