Sat Nov 23 2024 21:53:01 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీపై హరీశ్ కామెంట్స్ వైరల్
తాజాగా రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు ఆంధ్రప్రదేశ్ పై చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి
బీఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పై ఆ పార్టీ నేతలు విమర్శలు కొంచెం తగ్గించారని భావించాలి. కానీ అప్పుడప్పుడు మాత్రం ఏపీపై వారి విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయిన రాష్ట్రంతో పోటీ పెట్టుకోవడం ఎన్నికల సమయంలో నేతలకు అలవాటుగా మారింది. తాజాగా రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలు ఇందుకు నిదర్శనమనే చెప్పాలి. ఏపీలో పదహారు లక్షల ఎకరాలు వరి సాగయితే, తెలంగాణలో 54 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుందని మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది.
వరి అన్నం...
సిద్దిపేట జిల్లాలోని జగదేవ్‌పూర్ మండలంలో ఆయన ఒక కార్యక్రమంలో పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ చరిత్రను తిరగ రాశాడన్నారు. ఈ యాసంగిలో ఏపీ కంటే తెలంగాణలోనే ఎక్కువ వరి సాగవ్వడమే ఇందుకు నిదర్శనమని హరీశ్‌రావు తెలిపారు. తెలంగాణ ప్రజలు జొన్న,మక్క, తప్ప ఏమీ తెలియదని, తెలుగుదేశం పార్టీ వచ్చేంత వరకూ వారికి వరి అన్నం తెలియదని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై హరీశ్ రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు మతిభ్రమించి మాట్లాడుతున్నారని హరీశ్ రావు మండిపడ్డారు.
Next Story