Thu Dec 26 2024 09:33:10 GMT+0000 (Coordinated Universal Time)
BRS : మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు మరోసారి నోటీసులు
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు విద్యుత్తు శాఖ పై నియమించిన కమిషన్ మరోసారి నోటీసులు జారీ చేసింది
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు విద్యుత్తు శాఖ పై నియమించిన కమిషన్ మరోసారి నోటీసులు జారీ చేసింది. తెలంగాణలో జరిగిన విద్యుత్తు ఒప్పందాలపై జస్టిస్ ఎల్. నరసింహారెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం కమిషన్ నియమించిన సంగతి తెలిసిందే. ఈ కమిషన్ గత కొద్ది రోజులుగా విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలపై విచారణ జరుపుతుంది.
విద్యుత్తు కొనుగోలు ...
గతంలోనూ మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులు ఇచ్చింది. అయితే దానిపై సంతృప్తి చెందని కమిషన్ మరోసారి నోటీసులు జారీ చేసింది. విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలపై తమ అభిప్రాయాలను తెలపాలంటూ కమిషన్ ఈ నోటీసుల్లో పేర్కొంది. ఈ నెల 27వ తేదీలోగా తమకు వివరణ ఇవ్వాలని కోరింది. దీనికి మరి కేసీఆర్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. కేసీఆర్ ఇప్పటికే కమిషన్ నురద్దు చేయాలంటూ హైకోర్టు ను ఆశ్రయించిన నేపథ్యంలో ఆయన వివరణ ఇవ్వడంపై సస్పెన్స్ నెలకొంది.
Next Story