Mon Dec 23 2024 12:35:57 GMT+0000 (Coordinated Universal Time)
Kaleswaram Project : నేటి నుంచి కాళేశ్వరం విచారణ ప్రారంభం
ఈరోజు నుంచి కాళేశ్వరం ప్రాజెక్టుపై కమిషన్ విచారణ ప్రారంభించనుంది.
ఈరోజు నుంచి కాళేశ్వరం ప్రాజెక్టుపై కమిషన్ విచారణ ప్రారంభించనుంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ జడ్జితో కమిషన్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. నేటి నుంచి తిరిగి కాళేశ్వరం ప్రాజెక్టుపై కమిషన్ బమహిరంగ విచారణ చేపట్టనుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో పెద్దయెత్తున అవినీతి జరిగిందని అధికార కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది.
ఇప్పటికే కొందరిని విచారించి...
ఈ మేరకు కమిషన్ ఏర్పాటు చేసింది. ఈకమిషన్ ఇప్పటికే కొందరిని విచారించింది. ఈరోజు కమిషన్ ఎదుటకు ఏడుగురు చీఫ్ ఇంజినీర్లు, రీసెర్చ్ ఇంజనీర్లతో పాటు అడ్మినిస్ట్రేటివ్ అధికారులు రానున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కమిషన్ త్వరగా విచారణ పూర్తి చేసి నివేదిక ప్రభుత్వానికి అందించాలని కాంగ్రెస్ నేతలు కోరుతున్నారు. ఈ మేరకు వడివడిగా కమిషన్ తన విచారను ప్రారంభించి త్వరలోనే నివేదికను ప్రభుత్వానికి అందచేయనుంది.
Next Story