Mon Dec 15 2025 00:18:36 GMT+0000 (Coordinated Universal Time)
Dharani : నేడు ఐదు జిల్లాల కలెక్టర్లతో కమిటీ సమావేశం
గత ప్రభుత్వం తెచ్చిన ధరణి పోర్టల్ పై అధ్యయనం చేయడానికి నియమించిన కమిటీ నేడు ఐదు జిల్లాల కలెక్టర్లతో సమావేశం కానుంది.

గత ప్రభుత్వం అమలులోకి తెచ్చిన ధరణి పోర్టల్ పై అధ్యయనం చేయడానికి నియమించిన కమిటీ నేడు ఐదు జిల్లాల కలెక్టర్లతో సమావేశం కానుంది. రంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్ జిల్లా కలెక్టర్లతో ప్రత్యేకంగా కమిటీ సభ్యులు సమావేశం కానున్నారు. ధరణి పోర్టల్ పై ప్రజల నుంచి అనేక ఫిర్యాదులు అందాయి.
అనేక ఫిర్యాదులు...
తమ భూములను అక్రమంగా కొల్లగొట్టారని కొందరు. తమ భూముల వివరాలు ధరణి పోర్టల్ లో లేవని మరికొందరు ఇలా అనేక మంది ఫిర్యాదులు చేయడంతో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపై అధ్యయనం చేయడానికి కమిటీని నియమించింది. ధరణి పోర్టల్ లో ఉన్న సమస్యలు, వాటి పరిష్కారానికి ఏం చేయాలన్న దానిపై ఇప్పటికే రెండుసార్లు కమిటీ సమావేశమయింది. దీంతో పాటు ధరణి పోర్టల్ తీసుకు రావాల్సిన మార్పులు, చేర్పులు గురించి కూడా ఈ కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది.
Next Story

