వైఎస్ షర్మిలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదు
టీఆర్ఎస్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌ను అవమానించే విధంగా మాట్లాడారని దళిత సంఘాలు, టీఆర్ఎస్ నాయకులు షర్మిలపై
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై పోలీసులకు అందుతున్న ఫిర్యాదుల సంఖ్య పెరుగుతూ ఉంది. తాజాగా ఆమెపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని దళిత సంఘాల నాయకులు పోలీసులను ఆశ్రయించారు. అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్‌ను షర్మిల అవమానించారని దళిత సంఘాలు, టీఆర్ఎస్ నాయయకులు జోగిపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. షర్మిలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కోరిన వారిలో స్థానిక దళిత సంఘం అధ్యక్షుడు సటికె రాజు, ఇతర ఎస్సీ నాయకులు ఉన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌ను అవమానించే విధంగా మాట్లాడారని దళిత సంఘాలు, టీఆర్ఎస్ నాయకులు షర్మిలపై జోగిపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర చేస్తున్నారు. సెప్టెంబర్ 30న జోగిపేట పట్టణంలో నిర్వహించిన రోడ్‌షోలో షర్మిల క్రాంతి కిరణ్‌పై భూకబ్జాదారుడని దూషించారని రాజు ఆరోపించారు. అలాగే క్రాంతి కిరణ్‌పై అవమానకరమైన పదజాలం ఉపయోగించారని చెప్పారు. పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేస్తారని తాను చాలా కాలంగా ఎదురుచూశామని.. వారి నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో దళిత సంఘం నాయకుడిగా దళిత ఎమ్మెల్యేకు జరిగిన అవమానంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు. వైఎస్ షర్మిపై ఫిర్యాదు అందిందని జోగిపేట పోలీసులు తెలిపారు. అయితే ఆమెపై ఎలాంటి కేసు నమోదు చేయలేదని చెప్పారు. ఉన్నతాధికారుల ఆదేశాల కోసం వేచి చూస్తున్నట్లు తెలిపారు.