Fri Dec 20 2024 06:29:01 GMT+0000 (Coordinated Universal Time)
రేవంత్ రెడ్డిపై ఏకంగా ఈడీకి ఫిర్యాదు
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై ఈడీకి ఫిర్యాదు చేశారు గద్వాల్
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై ఈడీకి ఫిర్యాదు చేశారు గద్వాల్ కాంగ్రెస్ బహిష్కృత నేత కురువ విజయ్ కుమార్. రేవంత్ రెడ్డి డబ్బులకు టికెట్లు అమ్ముకుంటున్నారని విజయ్ తన ఫిర్యాదులో తెలిపారు. టికెట్లు అమ్ముకున్న డబ్బులతో మనీ ల్యాండరింగ్ జరిగిందని.. రేవంత్ రెడ్డిపై సమగ్ర విచారణ జరపాలని ఈడీకి విజ్ఞప్తి చేశారు. రేవంత్ కాంగ్రెస్ అధిష్టానికి తప్పుడు నివేదికలు ఇచ్చి, ఎన్నికలకు రెండు నెలల ముందే డబ్బులకు టికెట్లు అమ్ముకున్నారని విజయ్ ఆరోపించారు. హైదరాబాద్‌లోని ఈడీ జాయింట్ డైరెక్టర్‌కు సాక్షాలతో సహా ఫిర్యాదు చేశారు.
రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ టికెట్లు అమ్ముకుంటున్నారని ఆ పార్టీ నుంచి గద్వాల్, ఉప్పల్ , బహదూర్‌పురా టికెట్లు ఆశించి భంగపడ్డ డాక్టర్ కురువ విజయ్‌కుమార్, రాగిడి లక్ష్మారెడ్డి, ఖలీమ్ బాబా ఆరోపించారు. మంగళవారం చార్మినార్‌లోని భాగ్యలక్ష్మి ఆలయం వద్ద అమ్మవారి ఎదుట ప్రమాణం కూడా చేశారు. రేవంత్ టికెట్లు అమ్ముకున్నాడని మేము అమ్మవారి ఎదుట ప్రమాణం చేశామన్నారు. టికెట్లు అమ్ముకోలేదని భాగ్యలక్ష్మి అమ్మవారి ఎదుట రేవంత్ రెడ్డి ప్రమాణం చేయాలన్నారు. కొన్నేళ్లుగా కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన వారికి అన్యాయం జరుగుతోందన్నారు. టికెట్ల విషయంలో ఎలాంటి అవినీతికి పాల్పడలేదని రేవంత్ రెడ్డి తన మనవడిపై ప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు.
Next Story