Thu Apr 10 2025 12:02:27 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : తెలంగాణ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు దెబ్బ
తెలంగాణ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతిచ్చిన అభ్యర్థులు ఓటమి పాలయ్యారు

తెలంగాణ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతిచ్చిన అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. హైదరాబాద్ - నల్లగొండ, కరీంనగర్ ఉపాధ్యా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక దాంట్లో పీఆర్టీయూ, మరొక చోట బీజేపీ మద్దతు బరిలో దిగిన అభ్యర్థులు విజయం సాధించారు. నల్లగొండ - ఖమ్మం - వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో పీఆర్టీయూ అభ్యర్థి పింగళి శ్రీపాల్ రెడ్డి గెలిచారు.
బీజేపీ మద్దతుతో గెలిచిన...
ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, మెదక్ ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో బీజేపీ మద్దతు పలికిన మల్క కొమరయ్య గెలుపొందారు. మరొక వైపు కరీంనగర్ - ఆదిలాబాద్ - మెదక్ జిల్లాలకు చెందిన గ్ర్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంలో కౌంటింగ్ ఇంకా జరుగుతూనే ఉంది. దీంతో ఈ ఫలితం వచ్చే సరికి ఈ రోజు రాత్రికి కానీ ఎవరిది ఆధిక్యం అన్నది తెలియదు.
Next Story