Sun Mar 30 2025 14:25:15 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : తీన్మార్ మల్లన్న ముందంజ.. రెండో ప్లేస్ బీఆర్ఎస్ దే
నల్లగొండ - ఖమ్మం - వరంగల్ జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి ముందంజలో ఉన్నారు.

నల్లగొండ - ఖమ్మం - వరంగల్ జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. ఇంకా ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. మొదటి రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న 36,210 ఓట్లతో ముందంజలో ఉండగా, తర్వాత బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్ రెడ్డికి 28,540 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి ప్రేమచందర్ రెడ్డికి 11,395 ఓట్లు వచ్చాయి.
మొదటి రెండు ...
అయితే తీన్మార్ మల్లన్నకు ఈ ఎన్నికల్లో మొదటి రౌండ్ పూర్తయ్యే సరికి కేవలం 7,670 ఓట్లు మెజారిటీతో మాత్రమే ఉన్నారు. అయితే ఇంకా కౌంటింగ్ కొనసాగుతుండటంతో ఎవరిది గెలుపు అన్నది చివర వరకూ ఉత్కంఠగా మారనుంది. కౌంటింగ్ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కౌంటింగ్ పూర్తయ్యే సరికి ఈ రోజు మధ్యాహ్నం అవుతుందని అధికారులు చెబుతున్నారు.
Next Story