Fri Nov 22 2024 09:44:31 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : పోస్టల్ బ్యాలట్లో కాంగ్రెస్ ముందంజ
పోస్టల్ బ్యాలట్ లో కాంగ్రెస్ అభ్యర్థులు ముందంజలో ఉంది. 2.20 లక్షల ఓట్లు ఈసారి పోస్టల్ బ్యాలట్లు కీలకంగా మారనున్నాయి
పోస్టల్ బ్యాలట్ లో కాంగ్రెస్ అభ్యర్థులు ముందంజలో ఉంది. 2.20 లక్షల ఓట్లు ఈసారి పోస్టల్ బ్యాలట్లు నమోదు కావడంతో ఇవి కూడా కీలకంగా మారనున్నాయి. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం పోస్టల్ బ్యాలట్లలో బీఆర్ఎస్ 22, కాంగ్రెస్ 41, బీజేపీ 2, ఎంఐఎం 3 స్థానాల్లో ముందంజలో ఉన్నట్లు తేలింది.
కీలకంగా మారనున్న...
ఈసారి పోస్టల్ బ్యాలట్లు కూడా కీలకంగా మారనుండటంతో అభ్యర్థులు ముందుగానే జాగ్రత్తలు తీసుకున్నారు. దీన్ని బట్టి ఉద్యోగుల్లో కూడా అధికార పార్టీపై వ్యతిరేకత కనిపిస్తుంది. కామారెడ్డిలో మాత్రం బీజేపీ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. చాంద్రాయణగుట్టలో ఎంఐఎం అభ్యర్థి ముందంజలో ఉన్నారు. పోస్టల్ బ్యాలట్ లో ఆధిక్యం తమ విజయానికి సంకేతమని కాంగ్రెస్ నేతలు చెబుతుండగా, పోస్టల్ బ్యాలట్ కు, సాధారణ ఓటరుకు మధ్య చాలా తేడా ఉంటుందని బీఆర్ఎస్ భావిస్తుంది.
Next Story