Mon Dec 23 2024 03:02:38 GMT+0000 (Coordinated Universal Time)
ఎమ్మెల్యేల కొనుగోళ్లపై రాహుల్ ఏమన్నారంటే?
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్ ను రద్దు చేస్తామని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ తెలిపారు
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్ ను రద్దు చేస్తామని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ తెలిపారు. ధరణి పోర్టల్ వల్ల వస్తున్న ఇబ్బందులను రైతులు తమ దృష్టికి తీసుకు వచ్చారని తెలిపారు. కౌలు రైతులకు తమ అధికారంలోకి వస్తే అండగా ఉంటామని చెప్పారు. రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని రాహుల్ గాంధీ తెలిపారు. ఈ సందర్భంగా పలువురు రైతులు తమ ఇబ్బందులను రాహుల్ దృష్టికి తెచ్చారు.
రైతు వ్యతిరేక చట్టాలను...
రైతు వ్యతిరేక మూడు చట్టాలను కాంగ్రెస్ పార్టీ వ్యతిరికించిన విషయాన్ని గుర్తు చేశారు. కాంగ్రెస్ రైతు పక్ష పార్టీగా ఉందన్నారు. రైతు చట్టాలకు టీఆర్ఎస్ మద్దతిచ్చిందని ఆయన గుర్తు చేశారు. తమిళానాడులో ప్రారంభమయిన యాత్ర కన్యాకుమారి వరకూ సాగుతుందన్నారు. టీఆర్ఎస్, బీజేపీకి కాంగ్రెస్ సమదూరం పాటిస్తుందని ఆయన తెలిపారు. రెండు పార్టీలు ప్రజాస్వామ్యానికి దూరంగా పనిచేస్తున్నాయని అన్నారు.
రెండు పార్టీలను...
కాళేశ్వరం ప్రాజెక్టులో పెద్ద యెత్తున అవినీతి జరిగిందన్నారు. పార్లమెంటులో ఏ బిల్లు పెట్టినా టీఆర్ఎస్ మద్దతిస్తుందన్నారు. రెండు పార్టీలు శాసనసభ్యులను కొనుగోలు చేస్తూ రాజకీయాలను భ్రష్టుపట్టిస్తున్నాయని రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. తెలంగాణలోనూ, అటు దేశంలోనూ ఇంతకు ముందు చూడని అవినీతి జరుగుతుందన్నారు. నిరుద్యోగ సమస్య పెరిగిపోతుందన్నారు. పదిహేను వేల కోట్ల మియాపూర్ ల్యాండ్ స్కాంకు టీఆర్ఎస్ పాల్పడిందన్నారు. నోట్ల రద్దుతో అనేక మంది ఇబ్బందులు పడుతున్నారని రాహుల్ గాంధీ అన్నారు. పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలను కేంద్ర ప్రభుత్వం విపరీతంగా పెంచిదని రాహుల్ మండి పడ్డారు.
Next Story